Corona Virus: దేశంలో వేగంగా టీకా పంపిణీ.. ఐదు రోజుల్లో రెండుసార్లు కోటికిపైగా వ్యాక్సిన్ల పంపిణీ

  • ఇప్పటి వరకు దేశంలో 65 కోట్ల మందికి టీకా
  • వీటిలో 60 కోట్లు ఒక్క కొవిషీల్డ్ డోసులే
  • నిన్న దేశవ్యాప్తంగా 1.28 కోట్ల టీకాల పంపిణీ
New 1 day high of 1 crore 28 lakhs jabs administrated

దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. మరీ ముఖ్యంగా గత ఐదు రోజులుగా టీకాలను విరివిగా పంపిణీ చేస్తున్నారు. నిన్న ఒక్క రోజే ఏకంగా 1.28 కోట్ల డోసులు పంపిణీ చేశారు. ఒక్క రోజులో ఇన్ని టీకాలు పంపిణీ చేయడం దేశంలో ఇదో రికార్డు.

కాగా, ఐదు రోజుల్లో కోటికిపైగా డోసులు పంపిణీ చేయడం ఇది రెండోసారి. ఆగస్టు 27న 1.03 కోట్ల డోసులు పంపిణీ చేశారు. ఫలితంగా ఇప్పటి వరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 65 కోట్లకు చేరింది. వీటిలో దాదాపు 60 కోట్లు ఒక్క సీరం ఇనిస్టిట్యూట్ (ఎస్ఐఐ) ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ టీకాలే కావడం గమనార్హం.

ఈ మేరకు  నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగ సభ్యుడు డాక్టర్ వీకే పాల్, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్‌లకు ఎస్ఐఐ ప్రభుత్వ-నియంత్రణ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాశ్‌కుమార్ సింగ్ నివేదిక అందజేశారు.

More Telugu News