దీపావళి బరిలోకి 'ఖిలాడి' మూవీ!

31-08-2021 Tue 18:17
  • 'ఖిలాడి'గా రవితేజ ద్విపాత్రాభినయం
  • దర్శకుడిగా రమేశ్ వర్మ  
  • ప్రతినాయకుడిగా యాక్షన్ కింగ్ అర్జున్
  • త్వరలో రానున్న ఫస్టు సింగిల్
Khiladi movie will release at Deepavali
రవితేజ హీరోగా దర్శకుడు రమేశ్ వర్మ 'ఖిలాడి' సినిమాను రూపొందించాడు. సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దసరా రోజుల్లోనే ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమాను దీపావళికి విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా ఒక వార్త వినిపిస్తోంది.

రవితేజ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో ఆయన సరసన నాయికలుగా మీనాక్షి చౌదరి - డింపుల్ హయతి అలరించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. త్వరలోనే ఫస్టు సింగిల్ పలకరించనున్నట్టు చెబుతున్నారు.

భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాకి భారీ తారాగణం ప్రధానమైన ఆకర్షణ కానుంది. అర్జున్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాలో, సచిన్ కేడ్కర్ .. ముఖేశ్ రుషి .. ఉన్ని ముకుందన్ .. రావు రమేశ్ .. మురళీశర్మ .. వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.