Raghu Rama Krishna Raju: ఏపీ ఫైబర్ నెట్ ను అనర్హత జాబితాలో చేర్చండి: రఘురామకృష్ణరాజు

  • ఎంఎస్ఓ లైసెన్స్ ను అక్రమంగా వాడుతున్నారు
  • బ్రాడ్ కాస్టింగ్ బిల్లు 1997కు విరుద్ధం
  • ఫైబర్ నెట్ పై చర్యలు తీసుకుంది
Raghu Rama Krishna Raju demands to take action on AP Fibrenet

కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఏపీలో ఫైబర్ నెట్ సంస్థపై లేఖలో ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఫైబర్ నెట్ సంస్థ అనధికారికంగా, అక్రమంగా ఎంఎస్ఓ లైసెన్సును ఉపయోగిస్తోందని ఆయన అన్నారు. ఫైబర్ నెట్ చర్యలు బ్రాడ్ కాస్టింగ్ బిల్లు 1997కు విరుద్ధమని పేర్కొన్నారు.

బ్రాడ్ కాస్టింగ్ బిల్లు 1997 ప్రకారం ప్రభుత్వ సంస్థలు, ఎంఎస్ఓలు లైసెన్సులు పొందలేవని... అందువల్ల లైసెన్స్ ను అక్రమంగా వాడుతున్న ఫైబర్ నెట్ ను అనర్హత జాబితాలో చేర్చాలని కోరారు. ఏపీ ఫైబర్ నెట్ అక్రమ లైసెన్స్ ను తక్షణమే రద్దు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ ఫైబర్ నెట్ తప్పుడు సమాచారాన్ని పంపిణీ చేస్తోందని... దాన్ని కూడా అడ్డుకోవాలని అన్నారు.

More Telugu News