బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం, రోడ్డు పక్క భవనంలోకి దూసుకెళ్లిన 'ఆడి' కారు.. ఏడుగురి దుర్మరణం
- కోరమంగళలో ఘటన
- మృతుల్లో ముగ్గురు మహిళలు
- నుజ్జు అయిన ఆడి క్యూ3 కారు
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నుజ్జు అయిన కారు నుంచి మృతదేహాలను వెలికి తీసేందుకు కష్టపడాల్సి వచ్చింది. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.