New Judges: సుప్రీంకోర్టులో చారిత్రక ఘట్టానికి సర్వం సిద్ధం

  • ఒకేసారి 9 మంది జడ్జీల ప్రమాణస్వీకారం
  • గతంలో ఎన్నడూ లేని వైనం
  • అదనపు భవనం ఆడిటోరియంలో ప్రమాణస్వీకారం
  • ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీజేఐ నిర్ణయం
New judges for Supreme Court will take oath on Tuesday

సుప్రీంకోర్టులో మంగళవారం (ఆగస్టు 31) నాడు చారిత్రక సన్నివేశం చోటుచేసుకోనుంది. ఒకేసారి 9 మంది న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టు చరిత్రలో ఒకేసారి ఇంతమంది ఎప్పుడూ ప్రమాణస్వీకారం చేయలేదు. కాగా, కరోనా ప్రభావంతో ప్రమాణస్వీకార వేదికను మార్చారు. 1వ కోర్టు ప్రాంగణం నుంచి అదనపు భవనం ఆడిటోరియానికి వేదికను మార్చారు. గతంలో లేని విధంగా ఈసారి న్యాయమూర్తుల ప్రమాణస్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నిర్ణయించారు.

కొత్తగా ప్రమాణస్వీకారం చేయనున్న జడ్జీలు వీరే...

  • జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా
  • జస్టిస్ విక్రమ్ నాథ్
  • జేకే మహేశ్వరి
  • జస్టిస్ హిమా కోహ్లీ
  • జస్టిస్ నాగరత్న
  • జస్టిస్ రవికుమార్
  • జస్టిస్ సుందరేశ్
  • జస్టిస్ శ్రీనర్సింహ
  • జస్టిస్ మాధుర్య త్రివేది 

More Telugu News