Sunil Gavaskar: కోహ్లీ దృష్టి పెట్టాల్సింది ఎక్కడంటే.. సునీల్ గవాస్కర్ సలహా!

  • ఇంగ్లండ్‌లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న కోహ్లీ
  • ఛటేశ్వర్ పుజారాకూ సూచనలిచ్చిన సన్నీ
  • వీరి బ్యాటింగ్‌పై గవాస్కర్ విశ్లేషణ
Sunil Gavaskar Advice to Kohli Where should focus

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీసులో పరుగులు చేయడానికి చెమటోడుస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి.. లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఒక సలహా ఇచ్చాడు. కోహ్లీ ఎంచుకుంటున్న షాట్లే అతని ప్రధాన సమస్య అని సన్నీ చెప్పాడు. ఇప్పటి వరకూ జరిగిన మూడు టెస్టు మ్యాచుల్లో కోహ్లీ కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు. నిలకడగా రాణించడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో అతని బ్యాటింగ్‌ను విశ్లేషించిన సునీల్ గవాస్కర్.. కోహ్లీ మరీ ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని సూచించాడు.

షాట్ల ఎంపిక ముఖ్యమని, ఆలోచనలను సాధ్యమైనంత సింపుల్‌గా ఉంచుకోవడం మంచిదని సలహా ఇచ్చాడు. అతను క్రీజు వదిలి నిలబడటం వల్ల సమస్య వస్తుందా? అనే ప్రశ్నకు కూడా సన్నీ బదులిచ్చాడు. కోహ్లీ చేసిన 8 వేల పరుగుల్లో 6,500కి పైగా రన్స్ అలా క్రీజు బయట నిలబడే చేశాడని చెప్పిన గవాస్కర్.. అతని స్టాన్స్‌లో సమస్యేమీ లేదన్నాడు. ‘‘శరీరానికి ఎంత దూరంలో బ్యాట్ ఉంది? అనేదే కోహ్లీని ఇరుకున పెడుతోంది’’ అని గవాస్కర్ వివరించాడు.
.
ఛటేశ్వర్ పుజారా గురించి కూడా ఈ లెజెండరీ క్రికెటర్ మాట్లాడాడు. పుజారా కూడా కోహ్లీ వంటి సమస్యలే ఎదుర్కొంటున్నాడని ఆయన అభిప్రాయపడ్డాడు. ‘‘ఇక్కడ మనసులోని భావన ముఖ్యం. ఇక్కడ అతను పరుగులు రాబట్టాలని అనుకుంటున్నాడు. అంటే కొన్ని ఆడకూడని బంతులను కూడా ఆడుతున్నాడు. ఇది కూడా చివరకు షాట్ల ఎంపిక సమస్యే’’ అని తేల్చేశాడు.

More Telugu News