Varla Ramaiah: జగన్, గౌతమ్ సవాంగ్ వచ్చాక పోలీసు ప్రతిష్ఠ మసకబారుతోంది: వర్ల రామయ్య

Varla Ramaiah comments on AP Police
  • ఏపీ పోలీసులపై వర్ల విమర్శలు
  • పోలీసు వ్యవస్థ గాడితప్పిందని వ్యాఖ్య  
  • చాలా ఆధారాలున్నాయని వివరణ
  • సాక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యలు
ఏపీ పోలీసు విభాగంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ సీఎం అయ్యాక, గౌతమ్ సవాంగ్ డీజీపీగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర పోలీసు ప్రతిష్ఠ మసకబారుతోందని అన్నారు. ఏదైతేనేమి, కొన్ని కారణాల వల్ల పోలీసు వ్యవస్థ గాడితప్పిందని అభిప్రాయపడ్డారు. ఏ ప్రాంతంలో గాడితప్పిందో చెప్పేందుకు చాలా ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. సాక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు.

"పోలీసు వ్యవస్థకు ఈ గతి ఎందుకు పట్టింది? పేరు ప్రఖ్యాతులు పొందిన పోలీసులు నేడు మసకబారిపోవడానికి మొదట జగన్, ఆ తర్వాత గౌతమ్ సవాంగ్ లే కారణం" అని వర్ల రామయ్య ఆరోపించారు.
Varla Ramaiah
AP Police
CM Jagan
DGP Goutham Sawang
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News