'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

30-08-2021 Mon 19:14
  • మలయాళ రీమేక్ గా 'భీమ్లా నాయక్'
  • సంగీత దర్శకుడిగా తమన్ 
  • వచ్చేనెల 2వ తేదీన పవన్ బర్త్ డే 
  • ఆ రోజున 11:16 గంటలకు ఫస్టు సింగిల్  
Bheemla Nayak title song will release at September 2nd

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా సాగర్ చంద్ర దర్శకత్వంలో 'భీమ్లా నాయక్' సినిమా రూపొందుతోంది. మలయాళంలో ఆ మధ్య భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కనిపించనున్నాడు.

ఈ సినిమా నుంచి ఇటీవల వదిలిన వీడియోకి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. వచ్చేనెల 2వ తేదీన పవన్ పుట్టినరోజు. ఆ రోజున ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్టు హింట్ ఇచ్చారు. ఆ రోజున ఏ సమయానికి రిలీజ్ చేయనున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తూ, తాజాగా ఒక పోస్టర్ ను వదిలారు.

పవన్ పుట్టినరోజున ఉదయం 11:16 గంటలకు ఫస్టు సింగిల్ గా టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా, రానా జోడీగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.