Bhanumathireddy: 'భానుమతిరెడ్డి' ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన వైసీపీ ఎంపీ

YCP MP Margani Bharatram releases Bhanumathireddy first look
  • ప్రేమకథతో తెరకెక్కుతున్న భానుమతిరెడ్డి
  • నేడు ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం
  • హాజరైన మార్గాని భరత్ రామ్
  • చిత్ర బృందానికి శుభాకాంక్షలు
వైసీపీ యువ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొన్నారు. విలేజ్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న 'భానుమతిరెడ్డి' చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మార్గాని భరత్ మాట్లాడుతూ, సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇందులోని నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి గుర్తింపు రావాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. నిర్మాత రాంప్రసాద్ రెడ్డికి, చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

'భానుమతిరెడ్డి' చిత్రాన్ని డైమండ్ హౌస్ బ్యానర్ పై రాంప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలు, అప్సర ప్రధానపాత్రల్లో నటిస్తుండగా, సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది.
Bhanumathireddy
Firstlook
Margani Bharat Ram
MP
YSRCP
Tollywood

More Telugu News