మీకు రోజులు దగ్గర పడ్డాయ్.. పాకిస్థాన్ కు పంపిస్తాం: రాజాసింగ్

30-08-2021 Mon 17:55
  • తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే
  • పాతబస్తీలో సభ పెడితే ఏమీ చేయలేకపోయారు
  • మోదీ దెబ్బకు ఎంఐఎం నేతలు జనగణమన పాడుతున్నారు
Will send MIM leaders to Pakistan says Raja Singh
ఎంఐఎం పార్టీపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంఐఎం దొంగలను పాకిస్థాన్ కు పంపిస్తామని అన్నారు. మోదీ దెబ్బకు ఎంఐఎం నేతలు ఇప్పటికే జనగణమన పాడుతున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎంఐఎం వత్తాసు పలుకుతుందని విమర్శించారు. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని... అప్పుడు ఏం చేస్తారో ఎంఐఎం నేతలు ఇప్పుడే చెప్పాలని అన్నారు. పాతబస్తీలో ఛార్మినార్ వద్ద సభ పెట్టామని... ఎవరూ ఏమీ చేయలేకపోయారని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమని అన్నారు.