Narayan Rane: సంజయ్ రౌత్ శివసేన పార్టీని భ్రష్టుపట్టిస్తున్నాడు: కేంద్రమంత్రి రాణే

Union Minister Narayan Rane comments on Shiv Sena MP Sanjay Raut
  • మహారాష్ట్రలో రాణే వర్సెస్ శివసేన
  • రాణే కుమారులపై సంజయ్ రౌత్ వ్యాఖ్యలు
  • తీవ్రంగా స్పందించిన రాణే
  • తన పత్రికలో వరుస కథనాలు రాస్తానని హెచ్చరిక
మహారాష్ట్రలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. సీఎం ఉద్ధవ్ థాకరేపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి నారాయణ్ రాణేను, ఆయన కుటుంబ సభ్యులను శివసేన వర్గాలు లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో రాణే కుమారులు ఎమ్మెల్యే నితీశ్, మాజీ ఎంపీ నీలేశ్ పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాణే రాజకీయ జీవితాన్ని ఆయన కుమారులే దెబ్బతీస్తున్నారని  విమర్శించారు. శివసేన నేతలపై వారిద్దరూ చేస్తున్న అనాగరిక వ్యాఖ్యలతో రాణేకే నష్టం అని అన్నారు.

దీనిపై రాణే అదే రీతిలో బదులిచ్చారు. రౌత్ కారణంగా శివసేన పార్టీ భ్రష్టుపట్టిపోతోందని వ్యాఖ్యానించారు. రౌత్ తన వ్యాఖ్యలతో శివసేనను పతనం దిశగా తీసుకెళుతున్నాడని పేర్కొన్నారు. అంతేకాదు, శివసేన నేతలు తనపై వ్యక్తిగత విమర్శలు ఆపకపోతే, తన 'ప్రహార్' పత్రికలో వరుసగా విమర్శనాత్మక కథనాలు రాయాల్సి ఉంటుందని రాణే హెచ్చరించారు.
Narayan Rane
Sanjay Raut
BJP
Shiv Sena
Maharashtra

More Telugu News