Ram: బోయపాటి-రామ్ చిత్రం అప్ డేట్!

Update on Boyapati and Ram combo film
  • యాక్షన్ చిత్రాలకు పెట్టిందిపేరు బోయపాటి 
  • ప్రస్తుతం బాలయ్యతో చేస్తున్న 'అఖండ'
  • తదుపరి చిత్రం ఎనర్జిటిక్ హీరో రామ్ తో
  • నిర్మాతగా మిర్యాల రవీందర్ రెడ్డి    
వెండితెరపై యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలను అద్భుతంగా ఆవిష్కరించగల సత్తా వున్న కొద్ది మంది దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు. ఆయన సినిమాలలో హీరో..  విలన్ల పాత్రలను ప్రవేశపెట్టే విధానాన్ని.. ఆయా పాత్రల మధ్య క్లాష్ ను.. పర్యవసానంగా వచ్చే యాక్షన్ దృశ్యాలను సరికొత్తగా తీర్చిదిద్దుతారు. అందుకే మాస్ హీరోలు ఆయనతో సినిమా చేయడానికి ఉత్సాహాన్ని, ఆసక్తిని చూపుతుంటారు.
 
ఈ నేపథ్యంలో ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో 'అఖండ' పేరిట యాక్షన్ ఎంటర్ టైనర్ ను రూపొందిస్తున్న బోయపాటి.. తన తదుపరి చిత్రాన్ని ఎనర్జిటిక్ హీరో రామ్ తో చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం 'అఖండ' చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్టుతో నిర్మించడానికి ముందుకొచ్చారు.

ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీలైన్ రామ్ కి బాగా నచ్చిందనీ, ప్రస్తుతం పూర్తి స్క్రిప్టును సిద్ధం చేసే పనిలో ఉన్నారనీ సమాచారం. ఇదిలావుంచితే, రామ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. ఇది పూర్తయ్యాక బోయపాటి చిత్రాన్ని చేస్తాడట.
Ram
Boyapati Sreenu
Balakrishna
Lingusamy

More Telugu News