Anand Mahindra: అవని లేఖరకు స్పెషల్ ఎస్ యూవీ: ఆనంద్ మహీంద్రా ప్రకటన

Anand Mahindra announces special suv for Avani Lekhara
  • దివ్యాంగుల కోసం వాహనాలు రూపొందించాలన్న దీపా
  • అంగీకరించిన ఆనంద్ మహీంద్రా
  • టోక్యో పారాలింపిక్స్ లో స్వర్ణం నెగ్గిన అవని
  • షూటింగ్ అంశంలో ఫస్ట్ ప్లేస్
  • తొలి వాహనం అవనికే ఇస్తామని వెల్లడి
టోక్యో పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు మెరుగైన ప్రతిభ చూపుతూ ఇప్పటివరకు 7 పతకాలు సాధించారు. వాటిలో ఒక స్వర్ణ పతకం కూడా ఉంది. 10 మీటర్ల షూటింగ్ అంశంలో అవని లేఖర పసిడి సాధించింది. కాగా, తాము ప్రత్యేకంగా రూపొందించిన ఎస్ యూవీ వాహనాన్ని అవని లేఖరకు కానుకగా ఇవ్వనున్నట్టు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.

దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఎస్ యూవీలు రూపొందించాలని ఇటీవల ఆనంద్ మహీంద్రాను పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా (పీసీఐ) చీఫ్ దీపా మాలిక్ కోరారు. దీపా మాలిక్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఆనంద్ వెంటనే స్పందించారు. దివ్యాంగుల అవసరాలకు అనుగుణంగా స్పెషల్ ఎస్ యూవీలను తయారుచేయాలని తన సంస్థలోని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ విధంగా తయారైన తొలి ఎస్ యూవీని అవని లేఖరకు అందిస్తామని ఆనంద్ తాజాగా వెల్లడించారు.
Anand Mahindra
Special SUV
Avani Lekhara
Gold
Tokyo Paralympics
Deepa Malik
PCI
India

More Telugu News