Tollywood: బిగ్​ బాస్​ హౌస్​ లోకి ‘ఇండియన్​ ఐడల్​’ శ్రీరామ చంద్ర!

Sri Ram Chandra May Contest In Bigg Boss 5 Season
  • సింగర్ కు చాన్స్ ఇవ్వాలని నిర్వాహకుల నిర్ణయం
  • ప్రతి సీజన్ లోనూ సింగర్ లు
  • గత సీజన్లలో గీతా మాధురి, రాహుల్ సిప్లిగంజ్
బిగ్ బాస్ సీజన్ లో ఇండియన్ ఐడల్ విజేత శ్రీరామ్ చంద్ర ఓ కంటెస్టెంట్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ కు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. హౌస్ సెట్టింగ్ కూడా పూర్తయిపోయింది. కొన్ని రోజుల క్రితమే ప్రోమోనూ విడుదల చేశారు. కంటెస్టెంట్లను ఎంపిక చేస్తున్నారు. సరయూ, విశ్వ, కొరియోగ్రాఫర్ నటరాజ్, యానీ మాస్టర్, యాంకర్ రవి, లోబో, మానస్, వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, ట్రాన్స్ జెండర్ ప్రియాంక, ఉమా దేవి, వర్షిణి, లహరి శ్రీ, ఆర్జే కాజల్ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు ఈ జాబితాలో శ్రీరామ చంద్ర పేరూ వచ్చి చేరింది. ప్రతి సీజన్ లోనూ ఓ సింగర్ ను హౌస్ లోకి పంపించేలా బిగ్ బాస్ నిర్వాహకులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. గత సీజన్లలో గీతా మాధురి, రాహుల్ సిప్లిగంజ్ లాగానే ఈసారి శ్రీరామ చంద్రను తీసుకురావాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే, శ్రీరామ చంద్ర నుంచి మాత్రం దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. అతడు ఎంట్రీ ఇస్తే మాత్రం గాత్రంతో ఆకట్టుకోవడం ఖాయమని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరి, 2010లో ఇండియన్ ఐడల్ గా నిలిచి తన గాత్రంతో అందరి మనసులను కొల్లగొట్టేసిన ఈ సింగర్.. బిగ్ బాస్ హౌస్ లో కాలు పెడుతున్నాడా? లేదా? అనేది తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.
Tollywood
Bigg Boss
Nagarjuna
Sri Rama Chandra
Indian Idol

More Telugu News