Devineni Uma: పెట్రో పన్నుల విషయంలో ఏపీ అగ్ర స్థానంలో నిలిచింది: దేవినేని

AP Govt stood in first place in petro taxes says Devineni Uma
  • పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు
  • కరోనా కాలంలో పెట్రో భారాన్ని ఇతర రాష్ట్రాలు తగ్గించాయి
  • ఏపీ ప్రభుత్వం మాత్రం అదనపు భారాన్ని మోపుతోంది
ఆకాశాన్నంటిన పెట్రోల్, డీజిల్ ధరలతో రాష్ట్ర ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. పెట్రో ఉత్పత్తులపై పన్నుల భారం విషయంలో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందని విమర్శించారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ... పెట్రో పన్నుల విషయంలో ఏపీ నెంబర్ వన్ గా నిలిచిందని... లీటర్ ధర సెంచరీ దాటినా పన్నులు తగ్గించే ప్రసక్తే లేదని ప్రభుత్వం అంటోందని విమర్శించారు.

 కరోనా కాలంలో ఈ భారాన్ని ఇతర రాష్ట్రాలు తగ్గించాయని... కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం రోడ్ సెస్, వ్యాట్ పేరుతో అదనపు భారాన్ని మోపుతోందని మండిపడ్డారు. అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉన్న ఏపీ.. పన్నుల మోత విషయంలో మాత్రం మొదటి స్థానంలో ఉన్న మాట నిజం కాదా? అని ప్రశ్నించారు.
Devineni Uma
Telugudesam
Petrol
Diesel
YSRCP

More Telugu News