Veligonda Project: కేఆర్ఎంబీకి రాసిన లేఖ వెనక్కి తీసుకోండి: సీఎం కేసీఆర్ ను కోరిన ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు

  • వెలిగొండపై కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ
  • అనుమతుల్లేవని ఫిర్యాదు
  • స్పందించిన టీడీపీ ఎమ్మెల్యేలు
  • సమస్యకు ఏపీ ప్రభుత్వమే కారణమని ఆరోపణ
Prakasham district TDP MLAs wrote CM KCR

వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతుల్లేవంటూ తెలంగాణ సర్కారు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేయడంపై ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు స్పందించారు. కేఆర్ఎంబీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలంటూ డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లేఖ రాశారు. విభజన చట్టంలో 6 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపిందని, వాటిలో వెలిగొండ ప్రాజెక్టు కూడా ఉందని వారు స్పష్టం చేశారు.

అయితే కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ లో వెలిగొండకు స్థానం దక్కకపోవడానికి ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. కేంద్ర గెజిట్ లో వెలిగొండను చేర్చేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందించలేదని తెలిపారు. ఇదేమీ ప్రకాశం జిల్లా రైతుల తప్పు కాదని వివరించారు. ఏపీ ప్రభుత్వం తప్పు చేస్తే, ప్రకాశం జిల్లా రైతుల ప్రయోజనాలకు భంగం వాటిల్లేలా ఫిర్యాదులు చేయడం సరికాదని పేర్కొన్నారు.

More Telugu News