COVID19: కరోనా నుంచి కోలుకున్న వారికి కొవాగ్జిన్​ ఒక్క డోసు చాలు: ఐసీఎంఆర్​ స్టడీలో వెల్లడి

Covaxin Gives Best Results For those Who Recovered From Covid than Non Covid Persons
  • కరోనా సోకని వారితో పోలిస్తే ఎక్కువ ప్రతిరక్షకాలు
  • మరింత అధ్యయనం చేయాలన్న ఐసీఎంఆర్
  • చెన్నైలో ఫిబ్రవరి నుంచి మే వరకు స్టడీ
కరోనా నుంచి కోలుకున్న వారికి కొవాగ్జిన్ టీకా వేస్తే కలిగే లబ్ధి రెండు రెట్లుంటుందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) పేర్కొంది. ఈ మేరకు చేసిన అధ్యయనం వివరాలను వెల్లడించింది. కరోనా సోకని వారితో పోలిస్తే.. కరోనా వచ్చి కోలుకున్న వారికి ఒక డోసు వ్యాక్సిన్ వేసినా రెండు డోసులన్ని ప్రతిరక్షకాలు ఉత్పత్తి అవుతాయని అధ్యయనంలో పేర్కొంది. దీనిపై మరింత విస్తృతంగా అధ్యయనాలు చేయాలని, అందులోనూ ఈ విషయం రుజువైతే వారికి ఒకే ఒక్క డోసు కొవాగ్జిన్ ఇస్తే సరిపోతుందని వెల్లడించింది.

ఈ అధ్యయనాన్ని చెన్నైలో నిర్వహించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మే వరకు వివిధ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో ఫస్ట్ డోస్ కొవాగ్జిన్ పొందిన 114 మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లలో ప్రతిరక్షకాల స్పందనను పరిశీలించింది. టీకా వేసిన 28 రోజులు, 56 రోజులకు వారిలో యాంటీబాడీలు ఉత్పత్తి అయిన తీరును అంచనా వేసింది.
COVID19
COVAXIN
Corona Virus
ICMR
Anti Bodies

More Telugu News