Delta Variant: డెల్టా వేరియంట్‌తో డేంజరే.. టీకా తీసుకోకుంటే ఆసుపత్రిపాలే: ‘కేంబ్రిడ్జి’ అధ్యయనం

  • ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే మూడు రెట్ల ముప్పు
  • 43,338 మందిపై పరిశోధన
  • వ్యాక్సిన్ తీసుకోని వారికి కరోనా ముప్పు అధికం
Delta Variant Dangerous than Alpha Variant

కరోనా డెల్టా వేరియంట్ ప్రమాదకరమైనదేనని, అది సోకితే ఆసుపత్రి పాలుకావాల్సిందేనని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్, కేంబ్రిడ్జి యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఆల్పా వేరియంట్‌తో పోలిస్తే డెల్టా వేరియంట్ సోకిన వారు ఆసుపత్రి పాలయ్యే ముప్పు మూడు రెట్లు అధికమని అధ్యయనం తేల్చింది. టీకా తీసుకోని వారిని ఈ వేరియంట్ మరింత ఇబ్బంది పెడుతున్నట్టు కూడా పరిశోధకులు గుర్తించారు. నిజానికి వ్యాక్సిన్ తీసుకోని వారే ఎక్కువగా ఈ వేరియంట్ బారినపడుతున్నట్టు పరిశోధకులు పేర్కొన్నారు.

ఈ ఏడాది మార్చి 29 నుంచి మే 23 వరకు ఇంగ్లండ్‌లో కరోనా బారినపడిన 43,338 మందిపై జరిపిన పరిశోధనల అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. వీరిలో 75 శాతం మంది టీకా తీసుకోనివారే. అలాగే, 24 శాతం మంది ఒక్క డోసు తీసుకోగా, 1.8 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. టీకా తీసుకున్న వారితో పోలిస్తే తీసుకోని వారే ఎక్కువశాతం ఆసుపత్రిలో చేరుతున్నట్టు అధ్యయనంలో గుర్తించినట్టు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త అన్నే ప్రెసానిస్ తెలిపారు.

More Telugu News