Virat Kohli: ఇంగ్లండ్ బౌలర్ల క్రమశిక్షణ మాతో తప్పిదాలు చేయించింది: విరాట్ కోహ్లీ

  • హెడింగ్లే టెస్టులో భారత్ ఓటమి
  • ఇన్నింగ్స్ 76 రన్స్ తేడాతో ఇంగ్లండ్ విజయం
  • ఒత్తిడికి లోనయ్యామన్న కోహ్లీ
  • తగినరీతిలో బదులివ్వలేకపోయామని వ్యాఖ్య  
Virat Kohli lauds English bowlers discipline

హెడింగ్లే టెస్టులో ఇంగ్లండ్ చేతిలో ఓటమి అనంతరం టీమిండియా సారథి విరాట్ కోహ్లీ తన స్పందన వెలిబుచ్చాడు. తొలి ఇన్నింగ్స్ లో తక్కువ స్కోరుకు ఆలౌటైన నేపథ్యంలో తమ ఆటగాళ్లు ఒత్తిడి తట్టుకోలేకపోయారని తెలిపాడు.

"తొలి ఇన్నింగ్స్ లో 80 పరుగుల లోపే ఆలౌటైనా, రెండో ఇన్నింగ్స్ లో కీలక భాగస్వామ్యాలతో కుదురుకున్నట్టే కనిపించాం. కానీ నాలుగో రోజు ఆట ఆరంభంలో ఇంగ్లండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మేం చేజేతులా వికెట్లు అప్పగించాం. ఇంగ్లండ్ బౌలింగ్ దాడులకు తగిన రీతిలో బదులివ్వలేకపోయాం.

ఇంగ్లండ్ లో జట్లు స్వల్పస్కోరుకే కుప్పకూలడం మామూలు విషయమే. పిచ్ కూడా బ్యాటింగ్ కు అనుకూలిస్తోంది. కానీ ఇంగ్లండ్ బౌలర్ల క్రమశిక్షణ మాతో తప్పులు చేయించింది. పరుగులు చేయలేకపోయాం, అదే సమయంలో వికెట్లూ కోల్పోయాం. షాట్ల ఎంపికలో సరైన నిర్ణయాలు తీసుకోని ఫలితమే ఈ ఓటమి. ఈ విజయానికి ఇంగ్లండ్ ఆటగాళ్లు అన్ని విధాలా అర్హులు" అని కోహ్లీ వివరించాడు.

More Telugu News