కాబూల్ ఎయిర్ పోర్టును దిగ్బంధించిన తాలిబన్లు
- ఇటీవల హమీద్ కర్జాయ్ ఎయిర్ పోర్టు వద్ద ఉగ్రదాడి
- ప్రజలు గుమికూడకుండా తాలిబన్ల చర్యలు
- అదనపు దళాల మోహరింపు
- నిలిచిన తరలింపు కార్యక్రమాలు
ఆఫ్ఘన్ బలగాల నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలతో తాలిబన్లు ప్రస్తుతం పహారా కాస్తున్నారు. ఆఫ్ఘన్ దళాల నుంచి స్వాధీనం చేసుకున్న యూనిఫాం, నైట్ విజన్ కళ్లజోళ్లు, ఆయుధాలతో తాలిబన్లు ఎయిర్ పోర్టు పరిసరాల్లో కనిపించారు. తాలిబన్ల తాజా చర్యలతో కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి తరలింపు కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.