V Srinivas Goud: బీజేపీ నేతలు అప్పుడే విషం చిమ్మే ప్రయత్నాలు మొదలు పెట్టారు: శ్రీనివాస్ గౌడ్

Srinivas goud fires on Bandi Sanjay
  • బండి సంజయ్ పాదయాత్ర చేపట్టడం విడ్డూరంగా ఉంది
  • ఏం హామీలను నెరవేర్చారో చెప్పాలి
  • ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నామని పాదయాత్రలో చెపుతారా?
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏం నెరవేర్చారో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాదయాత్ర చేపట్టడం విడ్డూరంగా ఉందని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని బీజేపీ అధికారంలోకి రాకముందు మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ హామీ ఇచ్చారని... ఆ హామీ ఏమయిందని ప్రశ్నించారు.

రైల్వేలు, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీలను ప్రైవేట్ పరం చేయబోతున్నామని చెప్పడానికి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారా? అని శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉన్నాయని... కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వంపై విషం చిమ్మేందుకు బీజేపీ నేతలు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారని మండిపడ్డారు.

V Srinivas Goud
TRS
Bandi Sanjay
BJP

More Telugu News