Cheteshwar Pujara: హెడింగ్లే టెస్టు: నాలుగో రోజు ఆట ఆరంభంలోనే పుజారా వికెట్ కోల్పోయిన భారత్

  • హెడింగ్లేలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్
  • 91 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పుజారా అవుట్
  • రాబిన్సన్ బౌలింగ్ ఎల్బీడబ్ల్యూ
  • క్రీజులో కోహ్లీ, రహానే
Pujara out early on day four at Headingley

హెడింగ్లే టెస్టులో ఆటకు నేడు నాలుగో రోజు కాగా, భారత్ ఆరంభంలోనే ఛటేశ్వర్ పుజారా వికెట్ చేజార్చుకుంది. తన ఓవర్ నైట్ స్కోరు 91కు ఒక్క పరుగు కూడా జోడించని పుజారా... రాబిన్సన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. వికెట్లకు ఆవల పడిన బంతిని వదిలేసే ప్రయత్నంలో పుజారా లెగ్ బిఫోర్ గా దొరికిపోయాడు. దాంతో భారత్ మూడో వికెట్ కోల్పోయింది.

ఇక ప్రస్తుతం భారత్ స్కోరు 86 ఓవర్లలో 3 వికెట్లకు 224 పరుగులు కాగా, ఇంకా 130 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (46 బ్యాటింగ్), అజింక్యా రహానే (5 బ్యాటింగ్) ఉన్నారు.

ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 78 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ అందుకు బదులుగా 432 పరుగులు చేసింది. తద్వారా కీలకమైన 354 పరుగుల ఆధిక్యం అందుకుంది.

More Telugu News