Rains: వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం... ఏపీకి వర్ష సూచన

  • 3.1 కిమీ ఎత్తులో ఆవర్తనం
  • నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం
  • రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు
  • అక్కడక్కడ భారీ వర్షాలు
Rain alert for AP

పశ్చిమ బెంగాల్ తీరాన్ని ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నట్టు తెలిపింది. ఈ క్రమంలో నేడు వాయవ్య-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది.

దీని ప్రభావంతో ఏపీలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇవాళ తూర్పుగోదావరి, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ.... రేపు విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.

More Telugu News