Atchannaidu: మా పార్టీ కార్యకర్తలను పోలీసులు బెదిరించారు: అచ్చెన్నాయుడు

atchennaidu slams ysrcp
  • బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడం ఏంటీ?
  • రాష్ట్రంలో పోలీసులు... వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు
  • నాపై కేసులు పెట్టినా భయపడను
ఆంధ్రప్రదేశ్‌లో తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో తాము 155 స్థానాలు గెలుచుకుంటామని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో పెరిగిపోతోన్న నిత్యావసర సరుకుల ధరలకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గం కొత్తపేట నుంచి నిర్వహించతలపెట్టిన బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రంలో పోలీసులు... వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని, తమ పార్టీ కార్యకర్తలను బెదిరించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. టెక్కలిలో వైసీపీని ఎవరైనా ఏమైనా అంటే ఓ పోలీసు అధికారి చాలా బాధపడిపోతున్నాడని ఆయన అన్నారు. శాంతియుతంగా జరుపుకుంటోన్న ర్యాలీలకు, కార్యక్రమాలకు అడ్డుపడటం తమ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేదని, వైసీపీ మాత్రం మాత్రం అడ్డుకుంటోందని విమర్శించారు. టీడీపీని వైసీపీ నాశనం చేయాలని కుట్రపన్నిందని ఆరోపించారు. తన మీద కేసులు పెట్టినా భయపడబోనని తెలిపారు.
Atchannaidu
Andhra Pradesh
Telugudesam

More Telugu News