Telugudesam: టీడీపీ మ‌హాధ‌ర్నా.. క‌డ‌ప జిల్లాలో నేత‌ల గృహ నిర్బంధాలు

  • మ‌హాధ‌ర్నాలో పాల్గొన్న బొండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు, గ‌ద్దె రామ్మోహ‌న్
  • పులివెందుల ఆర్టీసీ బ‌స్టాండ్ నుంచి ర్యాలీకి బీటెక్ ర‌వి పిలుపు
  • ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరింపు
tdp mahadarna in ap

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌తో పాటు నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను నిరసిస్తూ టీడీపీ మ‌హాధ‌ర్నా కార్యక్రమాలు చేపట్టింది. విజ‌య‌వాడ ధ‌ర్నా చౌక్ వ‌ద్ద  మ‌హాధ‌ర్నా నిర్వహించారు. ఇందులో బొండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు, గ‌ద్దె రామ్మోహ‌న్ తదితరులు కూడా పాల్గొన్నారు.

వైసీపీ ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త వ‌ల్లే రాష్ట్రంలో పెట్రోల్ ధ‌ర‌లు రూ.100 దాటాయని బొండా ఉమా అన్నారు. దేశంలో ఎక్క‌డాలేనంత‌గా ఏపీలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరిగిపోతున్నాయని విమర్శించారు. వైసీపీ ప్ర‌భుత్వం ప‌న్నులు పెంచుకుంటూ పోతోంద‌ని చెప్పారు. ఇప్ప‌టికైనా పెట్రోలు, డీజిల్ రేట్లు త‌గ్గించాల‌ని కోరారు.

మ‌రోవైపు, క‌డ‌ప జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. జిల్లాలో టీడీపీ నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. పులివెందుల ఆర్టీసీ బ‌స్టాండ్ నుంచి ర్యాలీకి బీటెక్ ర‌వి పిలుపునివ్వడంతో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. శ్రీకాకుళంలోని కోటబొమ్మాళిలో టీడీపీ బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు.

More Telugu News