Priyanka Chopra: 'సిటాడెల్' షూటింగులో గాయపడిన ప్రియాంక చోప్రా

 Priyanka Chopra got injured during Citadel web series shooting
  • 'సిటాడెల్' వెబ్ సిరీస్ లో నటిస్తున్న ప్రియాంక
  • లండన్ లో షూటింగ్
  • ప్రియాంకపై యాక్షన్ సీన్ల చిత్రీకరణ
  • ప్రియాంక కనుబొమ్మపై గాయం
బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా ప్రస్తుతం పలు అంతర్జాతీయ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తాజాగా 'సిటాడెల్' అనే యాక్షన్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అయితే లండన్ లో 'సిటాడెల్' ఎపిసోడ్లు చిత్రీకరిస్తున్న సమయంలో ప్రియాంక గాయపడింది. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది. సోషల్ మీడియాలో రెండు ఫొటోలు పోస్టు చేసిన ప్రియాంక వాటిలో తనకు తగిలిన గాయం ఎక్కడుందో చెప్పాలని అభిమానులను కోరింది. కొందరు అభిమానులు తప్పుగా సమాధానం చెప్పడంతో, ప్రియాంక కనుబొమ్మపై తగిలిన గాయాన్ని చూపి, అదే నిజమైన గాయం అని వెల్లడించింది.

కాగా 'సిటాడెల్' లో ప్రియాంక ఓ గూఢచారి పాత్ర పోషిస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో పెడ్రో లియాండ్రో, రిచర్డ్ మాడెన్ వంటి హాలీవుడ్ తారాగణం కనువిందు చేయనుంది. ఈ యాక్షన్ వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. హాలీవుడ్ లో విజయవంతమైన 'అవెంజర్స్: ఎండ్ గేమ్' చిత్ర నిర్మాతలు రూసో బ్రదర్స్ ఈ 'సిటాడెల్' వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు.
Priyanka Chopra
Injury
Citadel
Webseries

More Telugu News