Helicopter: విశాఖలో యారాడ దర్గా వద్ద హెలికాప్టర్ కలకలం

  • దర్గా వద్ద గాల్లో నిలిచిపోయిన హెలికాప్టర్
  • ఆందోళనకు గురైన స్థానికులు
  • గుట్టపై కూలిపోయి ఉంటుందని అనుమానాలు
  • తమ హెలికాప్టర్ కాదన్న నేవీ
Helicopter rage at Visakha Yarada Dargah

విశాఖ నగరంలోని యారాడ దర్గా వద్ద ఇవాళ ఓ హెలికాప్టర్ కలకలం రేపింది. గాల్లో ఒకే ప్రాంతంలో ఎక్కువ సేపు నిలిచిన హెలికాప్టర్ ను చూసి స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఆ హెలికాప్టర్ అతి తక్కువ ఎత్తులో ఎగరడంతో దర్గా ప్రాంతంలో పలు చెట్లు దెబ్బతిన్నాయని స్థానికులు తెలిపారు. ఆ హెలికాప్టర్ గుట్టపై కూలిపోయి ఉంటుందని కూడా కొందరు అభిప్రాయపడ్డారు. ఆ హెలికాప్టర్ ను స్థానికులు భారత నావికా దళానికి చెందినదిగా భావించారు. అయితే అది తమ హెలికాప్టర్ కాదని నేవీ స్పష్టం చేసింది. దాంతో ఆ హెలికాప్టర్ ఎక్కడిదన్నది అధికారులు ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News