Tapsi: చత్తీస్ గఢ్ హైకోర్టు తీర్పుపై తాప్సి స్పందన

Tapsi reaction on High Court verdict on intercourse between husband and wife
  • భార్యకు ఇష్టం లేకపోయినా భర్త శృంగారంలో పాల్గొనడంలో తప్పు లేదన్న చత్తీస్ గఢ్ హైకోర్టు
  • బలవంతం చేసినా అత్యాచారం కిందకు రాదని తీర్పు
  • మనం వినడానికి ఇది మాత్రమే మిగిలి ఉందన్న తాప్సి
చత్తీస్ గఢ్ హైకోర్టు ఇటీవల వెలువరించిన ఒక తీర్పుపై బాలీవుడ్ ప్రముఖులు పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ తమ వ్యతిరేకతను వ్యక్తీకరిస్తున్నారు. చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్యకు ఇష్టం ఉన్నా, లేకున్నా భర్త లైంగిక చర్యకు పాల్పడవచ్చని కోర్టు తీర్పును వెలువరించింది. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా లేక బలవంతంగా శృంగారంలో పాల్గొన్నప్పటికీ అది అత్యాచారం కిందకు రాదని కోర్టు స్పష్టం చేసింది.

కోర్టు తీర్పుపై సినీ నటి తాప్సి అసహనం వ్యక్తం చేసింది. మనం వినడానికి ఇప్పుడు ఇది మాత్రమే మిగిలి ఉందని ఆమె వ్యాఖ్యానించింది. బాలీవుడ్ గాయని సోనా మెహపాత్రా కూడా కోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
Tapsi
Tollywood
Bollywood

More Telugu News