Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టుకు నిధుల అంశంపై కేంద్రానికి తెలంగాణ లేఖ

  • ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరాలు
  • కేంద్రానికి లేఖ రాసిన తెలంగాణ ఈఎన్సీ
  • వెలిగొండకు నిధులు ఎలా విడుదల చేస్తారన్న ఈఎన్సీ
  • అనుమతుల్లేని ప్రాజెక్టు అని వ్యాఖ్య  
Telangana ENC wrote Union Govt on Veligonda project issue

ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం మరోసారి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వెలిగొండ ప్రాజెక్టుకు నిధుల అంశంపై కేంద్రానికి తాజాగా లేఖ రాసింది. వరద జలాల ఆధారంగా వెలిగొండ ప్రాజెక్టు చేపట్టారని ఆ లేఖలో తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ ఆరోపించారు.

వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు కృష్ణా నది మొదటి ట్రైబ్యునల్ లో ఎలాంటి కేటాయింపులు లేవని స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన గెజిట్ నోటిఫికేషన్ లోనూ వెలిగొండను అనుమతుల్లేని ప్రాజెక్టుగా పేర్కొన్నారని, మరి ఈ ప్రాజెక్టుకు నిధులు ఎలా మంజూరు చేస్తారని తెలంగాణ ఈఎన్సీ ప్రశ్నించారు. వెలిగొండపై తాము గతంలోనే ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఏఐబీపీ కింద కేంద్రం నిధులు ఇవ్వడం సమంజసం కాదని స్పష్టం చేశారు.

More Telugu News