దసరా బరిలోకి దిగిన 'మహా సముద్రం'

27-08-2021 Fri 12:27
  • ఎమోషన్ ప్రధానంగా సాగే 'మహాసముద్రం'
  • ప్రధానపాత్రల్లో శర్వానంద్ - సిద్ధార్థ్
  • కీలకమైన పాత్రలో జగపతిబాబు
  • అక్టోబర్ 14వ తేదీన విడుదల    
Maha Samudram will release at Dasara
సముద్రానికీ .. మనిషికి మధ్య ఏదో తెలియని ఎమోషన్ ఎప్పుడూ కనెక్టయ్యే కనిపిస్తుంది. అందుకే ఎమోషన్ ప్రధానమైన సన్నివేశాలను ఎక్కువగా సముద్రతీరంలో చిత్రీకరిస్తూ ఉంటారు. సముద్రం నేపథ్యంలో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. కంటెంట్ ఉన్న కథా కెరటాలు విజయతీరాలను చేరుకున్నాయి.

అలా అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహా సముద్రం' రూపొందింది. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాలో, శర్వానంద్ - సిద్ధార్థ్ ప్రధానమైన పాత్రలను పోషించగా, వారి సరసన నాయికలుగా అదితీ రావు హైదరీ .. అనూ ఇమ్మాన్యుయేల్ అలరించనున్నారు.

ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, జగపతిబాబు .. రావు రమేశ్ .. గరుడ రామ్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు.