Pashupathi Kumar Paras: నా ప్రాణాలకు ముప్పు ఉంది.. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వండి: అమిత్ షాను కోరిన కేంద్ర మంత్రి

  • ఫోన్ కాల్స్, మెసేజీల ద్వారా బెదిరింపులు వస్తున్నాయి
  • హాజీపూర్ పర్యటన సందర్భంగా ఆయిల్ విసిరారు
  • నాకు రక్షణ కల్పించడం ప్రభుత్వాల బాధ్యత
Pashupati Kumar Paras requests Amit Shah to provide Z Plus secutiry

తన ప్రాణాలకు హాని ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పరాస్ మొరపెట్టుకున్నారు. తనకు జడ్ ప్లస్ సెక్యూరిటీతో భద్రతను కల్పించాలని కోరుతూ అమిత్ షాకు లేఖ రాశారు. తన భద్రతా సమస్యలకు సంబంధించి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు కూడా ఆయన లేఖ రాశారు. ఎల్జేపీకి చెందిన కేశవ్ సింగ్ ఫోన్ కాల్స్, మెసేజీల ద్వారా తనను బెదిరిస్తున్నారని పశుపతి కుమార్ పరాస్ తెలిపారు.

తన నియోజకవర్గం హాజీపూర్ లో ఈ నెల 23న తాను పర్యటించానని... ఆ సందర్భంగా తనకు భారీ ఎత్తున ప్రజామద్దతు లభించడంతో ప్రత్యర్థులు ఆశ్చర్యపోయారని చెప్పారు. దీంతో ప్రత్యర్థులు నియమించిన వ్యక్తుల గుంపు ద్వారా తన అశ్విక దళానికి నల్ల జెండాలు చూపించారని, ఆయిల్ కూడా చల్లారని తెలిపారు. తన పార్టీలోని మరికొందరు నేతలకు కూడా బెదిరింపులు వచ్చాయని చెప్పారు. ఎల్జేపీ పార్టీ అధ్యక్షుడినైన తనకు సరైన భద్రత కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని తెలిపారు.

రామ్ విలాశ్ పాశ్వాన్ చనిపోయిన తర్వాత ఎల్జీపీ పార్టీ ముక్కలైంది. పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తానే పార్టీ అధ్యక్షుడినని ప్రకటించుకున్నారు. అయితే ఆయన చిన్నాన్న పశుపతి కుమార్ పరాస్ పార్టీని చీల్చి... ఎల్జేపీ అధ్యక్షుడిని తానే అని ప్రకటించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య రాజకీయ వైరం నడుస్తోంది.

More Telugu News