Sudheer Babu: ట్యాంక్ బండ్ అంతా మాదే.... ప్రభాస్ తో దోస్తీపై సుధీర్ బాబు స్పందన

Hero Sudheer Babu talks about his friendship with Prabhas
  • సుధీర్ బాబు హీరోగా శ్రీదేవి సోడా సెంటర్
  • ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం
  • మీడియాతో మాట్లాడిన హీరో సుధీర్ బాబు
  • ట్యాంక్ బండ్ పై ప్రభాస్ తో కలిసి చక్కర్లు కొట్టేవాడ్నని వెల్లడి
శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో సుధీర్ బాబు అగ్రహీరో ప్రభాస్ తో తన స్నేహబంధం గురించి వివరించారు. ప్రభాస్ తనకెంతో ఆత్మీయుడని సుధీర్ బాబు వెల్లడించారు.

'వర్షం' సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా కోసం ఏర్పాటు చేసిన కటౌట్లను చూసేందుకు తాను, ప్రభాస్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్దకు వెళ్లామని తెలిపారు. అక్కడి సినిమా థియేటర్ల వద్ద ప్రభాస్ కటౌట్లను చూసి హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ పై చేరుకుని రాత్రంతా అక్కడే గడిపామని సుధీర్ బాబు వివరించారు. ఆ సమయంలో తాను, ప్రభాస్, దేవి శ్రీ ప్రసాద్ 'వర్షం' పాటలు వింటూ ఎంజాయ్ చేశామని వెల్లడించారు. అప్పుడప్పుడు ప్రభాస్ తో కలిసి రాత్రివేళల్లో ట్యాంక్ బండ్ పై షికార్లు చేసేవాడ్నని తెలిపారు.

'వర్షం' సినిమాను బాలీవుడ్ లో 'బాఘీ' పేరుతో రీమేక్ చేయగా, అందులో విలన్ గా నటించింది సుధీర్ బాబే. తెలుగులో గోపీచంద్ పోషించిన పాత్రను హిందీలో సుధీర్ బాబు పోషించారు. హిందీ వెర్షన్ లో టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ జంటగా నటించారు.
Sudheer Babu
Prabhas
Friendship
Varsham Movie

More Telugu News