దేశంలో మరో 44,658 కరోనా పాజిటివ్ కేసులు

27-08-2021 Fri 10:00
  • దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • ఒక్క కేరళలోనే 30,007 కొత్త కేసులు
  • గత 24 గంటల్లో 496 మరణాలు
  • కోలుకున్న 32,988 మంది
  • ఇంకా 3,44,899 మందికి చికిత్స
India wide corona cases update

భారత్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 44,658 కరోనా పాజిటివ్ కేసులు గుర్తించారు. అదే సమయంలో 496 మంది కరోనాతో మృతి చెందారు. 32,988 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.

తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,26,03,188కి చేరింది. 3,18,21,428 మంది కోలుకోగా, ఇంకా 3,44,899 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 4,36,861కి పెరిగింది.

కాగా, దేశంలో నమోదవుతున్న కేసుల్లో కేరళలోనే అధికంగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. కేరళలో తాజాగా 30,007 పాజిటివ్ కేసులు, 162 మరణాలు నమోదైనట్టు తెలిపింది.