Photoshoot: బోనులో ఫొటోషూట్.. మోడల్‌పై చిరుతల దాడి!

  • జర్మనీలోని ప్రైవేటు ప్రాపర్టీలో ఫొటోషూట్
  • చిరుత బోనులోకి స్వయంగా వెళ్లిన జెస్సికా లేడాల్ఫ్
  • షూట్ మధ్యలో ఆమెపై దాడి చేసిన చిరుతలు
Photoshoot in a cage Cheetah attack on a model

జంతు ప్రేమికురాలిగా పాప్యులర్ అయిన జర్మనీ మోడల్ జెస్సికా లేడాల్ఫ్‌పై చిరుతలు దాడి చేశాయి. తూర్పు జర్మనీలోని నెబ్రాకు చెందిన బిర్గిట్ స్టేచ్ (48) అనే మహిళ.. ఒక జంతువుల షెల్టర్ నడుపుతోంది. స్వతహాగా జంతు శిక్షకురాలైన ఆమె.. అడ్వర్‌టైజింగులు లేదంటే షోలలో కొన్నాళ్లు ఉపయోగించి ఆ తర్వాత పక్కన పెట్టేసిన జంతువులను తన షెల్టర్‌లో పెంచుతుంది. అలా ఆమె వద్దకే వచ్చిన ట్రాయ్, పారిస్ అనే రెండు చిరుతలు ఉన్న బోనులోకి వెళ్లిన జెస్సికా ఫొటోషూట్‌ ప్రారంభించింది.

ఆ సమయంలోనే రెండు చిరుతలు ఆమెపై దాడి చేశాయి. ‘‘అవి నా బుగ్గలు, చెవి, తలను కొరుకుతూనే ఉన్నాయి’’ అని జెస్సికా తెలిపింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ సక్సెస్ అయిందని, అయితే ఆమె శరీరంపై గాట్లు అలాగే ఉన్నాయని వైద్యులు తెలిపారు.

ఈ ఫొటోషూట్ ఎవరు నిర్వహించిందీ ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, అయితే ప్రజలకు ఎటువంటి భయమూ అక్కర్లేదని స్థానిక అధికారులు చెప్పారు. ఈ దాడి చేసిన రెండు చిరుతలు .. పానాసోనిక్ యాడ్‌లో ఒకసారి కనిపించినట్లు సమాచారం.

More Telugu News