Mullah Adul Qayyum Zakir: 'గ్వాంటనామో బే ఖైదీ'కి ఆఫ్ఘనిస్థాన్ దేశ రక్షణ శాఖ..?

Afghan defense ministry to Mullah Adul Qayyum Zakir as per reports
  • త్వరలో ఆఫ్ఘన్ లో తాలిబన్ ప్రభుత్వం
  • ముల్లా జకీర్ కు రక్షణ శాఖ అంటూ ప్రచారం
  • 2001లో అమెరికా దళాలకు లొంగిపోయిన జకీర్
  • గ్వాంటనామో బే జైల్లో ఏడేళ్లపాటు ఉన్న వైనం
నరకం అనేది భూమిపై ఉంటే అది అమెరికాలోని గ్వాంటనామో బే జైలేనని అక్కడ శిక్ష అనుభవించిన ఖైదీలు చెబుతుంటారు. అక్కడ ఖైదీల పట్ల ఎంత అమానుషంగా వ్యవహరిస్తారో చెప్పేందుకు నరకం అనే మాట ఒక్కటే సరిపోతుంది. అలాంటి జైలులో శిక్ష అనుభవించిన తాలిబాన్ నేత ముల్లా అబ్దుల్ ఖయ్యూం జకీర్ కు ఆఫ్ఘనిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖ అప్పగించనున్నట్టు తెలుస్తోంది.

అమెరికా దళాలు ఆగస్టు 31 కల్లా ఆఫ్ఘన్ ను వీడాలని హుకుం జారీ చేసిన తాలిబన్లు... ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాల్లో మునిగితేలుతున్నారు. ఆఫ్ఘన్ అధ్యక్షుడిగా ముల్లా బరాదర్ పేరు దాదాపుగా ఖరారైంది. ఇక కీలకమైన రక్షణ శాఖను ముల్లా జకీర్ కు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.

జకీర్ 2001లో అమెరికా దళాలకు లొంగిపోయారు. అప్పట్లో అమెరికా బలగాలు ఆఫ్ఘన్ గడ్డ మీద తాలిబన్లపై విరుచుకుపడ్డాయి. ఈ సందర్భంగా లొంగిపోయిన పలువురు కీలక ఉగ్రవాదులను అమెరికా గ్వాంటనామో బే జైలుకు తరలించింది. వీరిలో జకీర్ కూడా ఉన్నారు.

గ్వాంటనామో బే జైల్లో ఆయన ఏడేళ్ల పాటు ఖైదీగా ఉన్నారు. ఆ తర్వాత ఆయనను ఆఫ్ఘనిస్థాన్ లోని పౌల్-ఇ-చర్ఖీ జైలుకు తరలించారు. తీవ్ర ఒత్తిళ్లు రావడంతో జకీర్ ను 2008లో ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. అనంతరం జకీర్ తాలిబన్లలో కీలకనేతగా ఎదిగారు. పలు ప్రాంతాల్లో తాలిబన్ దళాలను నడిపించారు.
Mullah Adul Qayyum Zakir
Defense Ministry
Afghanistan
Guantanamo Bay
USA

More Telugu News