Varla Ramaiah: సజ్జలకు చిత్తశుద్ధి ఉంటే జగన్ రూ. 43 వేల కోట్ల అవినీతిపై మాట్లాడాలి: వర్ల రామయ్య

Sajjala has to speak on Jagans corruption says Varla Ramaiah
  • నేర రాజకీయాలపై సజ్జల మాట్లాడటం హాస్యాస్పదం
  • తాలిబన్లకు మించిన అరాచకం ఏపీలో రాజ్యమేలుతోంది
  • దేశంలో అత్యంత అవినీతిపరుడిగా జగన్ రికార్డులకెక్కారు 

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. నేర రాజకీయాలపై సజ్జల మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. నేర రాజకీయాలపై పేటెంట్ హక్కులు వైసీపీవేనని చెప్పారు. సజ్జల వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని దుయ్యబట్టారు. ఏపీలో తాలిబన్ ఉగ్రవాదులకు మించిన అరాచకం రాజ్యమేలుతోందని అన్నారు. దేశంలో అత్యంత అవినీతిపరుడైన రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రి జగన్ రికార్డులకెక్కారని చెప్పారు.

వైసీపీ అంటేనే నేరమయ రాజకీయాలకు, అసాంఘిక శక్తులకు నిలయమని వర్ల అన్నారు. వైసీపీ నేతల అవినీతిని అచ్చు వేస్తే పెద్ద గ్రంథమే అవుతుందని చెప్పారు. సజ్జలకు చిత్తశుద్ధి ఉంటే జగన్ అవినీతిపై విచారణ జరిపించాలని... షెల్ కంపెనీలు, క్విడ్ ప్రోకో అవినీతిపై ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లలో వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయన్న కోర్టు ప్రశ్నకు సమాధానమివ్వాలని అన్నారు.

  • Loading...

More Telugu News