Toxic Gas: విశాఖలో అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమ నుంచి విషవాయువు లీక్

Toxic gas leakage from Admiron Life Sciences pharma company in Vizag
  • విశాఖలో విషవాయువు కలకలం
  • బాయిలర్ నుంచి లీకైన రసాయన వాయువు
  • ఉక్కిరిబిక్కిరైన కార్మికులు
  • లీకేజిని అరికట్టిన సాంకేతిక నిపుణులు 
విశాఖపట్నంలో మరోసారి విషవాయువు కలకలం రేగింది. ఇక్కడి పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్న అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమ నుంచి ప్రమాదకర రసాయన వాయువు లీక్ అయింది. ఈ ఫార్మా కంపెనీలో ఓ బాయిలర్ నుంచి విషవాయవులు లీక్ కావడంతో కార్మికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సమీప గ్రామాల ప్రజలు కూడా దీని ప్రభావానికి గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వెంటనే స్పందించిన ఫార్మా కంపెనీ అధికారులు కార్మికులను పరిశ్రమ నుంచి బయటికి తరలించారు. రసాయన వాయువు లీకేజిని గుర్తించిన సాంకేతిక బృందం నష్టం జరగకుండా నివారించింది. కొద్దిసేపు శ్రమించి లీకేజిని అరికట్టింది. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని పోలీసులు వెల్లడించారు.
Toxic Gas
Leakage
Admiron Life Sciences
Vizag

More Telugu News