అమ్మడానికి ఇవి మోదీ ఆస్తులో, బీజేపీ ఆస్తులో కావు: మమత బెనర్జీ
- దేశ ఆస్తులను ఇష్టానుసారం అమ్మడం కుదరదు
- ఎన్ఎంపీ పాలసీ దురదృష్టకరం
- కేంద్రం నిర్ణయాన్ని అందరం సమష్టిగా ఎదుర్కోవాలి
ఎన్ఎంపీ పాలసీ నిర్ణయం దురదృష్టకరమని, తమకు షాక్ కలిగించిందని మమత చెప్పారు. ఈ ఆస్తులను అమ్మడం ద్వారా వచ్చే డబ్బును ఎన్నికల్లో విపక్షాలను ఓడించేందుకు వినియోగిస్తారని ఆరోపించారు. కోల్ కతాలోని సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న ఈ నిర్ణయాన్ని యావత్ దేశం ఐకమత్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఎన్ఎంపీ పాలసీ ద్వారా రూ. 6 లక్షల కోట్ల వరకు డబ్బును సమీకరిస్తామని గత సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.