Virat Raj: నాటి అందాల కథానాయకుడు హరనాథ్ ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇస్తున్న హీరో!

  • సీనియర్ హీరోగా వెలిగిన హరనాథ్
  • రొమాంటిక్ హీరోగా అప్పట్లో మంచి క్రేజ్
  • ఆయన మనవడు విరాట్ రాజ్
  • నూతన దర్శకుడితో తొలి సినిమా  
New hero entry from Haranath family

తెలుగులో అందాల కథానాయకుడిగా హరనాథ్ కి మంచి క్రేజ్ ఉండేది. అప్పట్లో ఎన్టీఆర్ తరువాత దేవుడి పాత్రలకు తగిన నటుడిగా హరనాథ్ పేరు తెచ్చుకున్నారు. రొమాంటిక్ హీరోగా హరనాథ్ ని అభిమానించే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉండేది. ఆయన నటనను .. నడకను వాళ్లు ఎంతగానో ఇష్టపడేవారు.

ఇప్పటికీ చాలామంది అభిమానులు హరనాథ్ ను మరిచిపోలేదు. ఆయన ఫ్యామిలీ నుంచి ఎవరూ ఎందుకు ఇండస్ట్రీకి రాలేదని అనుకునేవారు ఉన్నారు. ఆ లోటును భర్తీ చేయడానికన్నట్టు, ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి ఒక హీరో ఎంట్రీ ఇస్తున్నాడు .. అతని పేరే విరాట్ రాజ్. ఇతను హరనాథ్ తమ్ముడైన వెంకట సుబ్బరాజుకు మనవడు.

విరాట్ రాజ్ తెలుగు తెరకి 'సీతామనోహర శ్రీరాఘవ' సినిమాతో పరిచయమవుతున్నాడు. వందన మూవీస్ బ్యానర్ పై సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, దుర్గా శ్రీవాత్సవ దర్శకత్వం వహిస్తున్నాడు. రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి, రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని సమకూర్చుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.

  • Loading...

More Telugu News