Sunil Gavaskar: కోహ్లీ.. వెంటనే సచిన్​ కు ఫోన్​ చెయ్: గవాస్కర్ సలహా

  • అతడి నుంచి సలహాలు తీసుకోవాలని కామెంట్
  • సిడ్నీ టెస్టును స్ఫూర్తిగా తీసుకోవాలని సూచన
  • కోహ్లీ కవర్ డ్రైవ్ ఆందోళన కలిగిస్తోందన్న గవాస్కర్
Kohli Should Call Sachin Tendulkar Suggests Sunil Gavaskar

సచిన్ టెండూల్కర్ నుంచి విరాట్ కోహ్లీ స్ఫూర్తి పొందాలని టీమిండియా మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచించారు. 2004 సిడ్నీ టెస్టులో సచిన్ తన సత్తా చాటి తిరిగి ఫామ్ లోకి వచ్చినట్టే కోహ్లీ కూడా ఫామ్ ను తిరిగి సంపాదించుకోవాలన్నారు. ‘‘కోహ్లీ వెంటనే సచిన్ టెండూల్కర్ కు ఫోన్ చేయాలి. ఏం చేయాలో అడగాలి. అతడి సలహాలు తీసుకోవాలి’’ అని సూచించారు. కవర్ డ్రైవ్ ఆడనని తనకు తాను చెప్పుకోవాలన్నారు.

లీడ్స్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో ఆండర్సన్ బౌలింగ్ లో కోహ్లీ కేవలం 7 పరుగులకే అవుటైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సన్నీ ఈ కామెంట్లు చేశారు. ఆఫ్ స్టంప్ కు ఆవల పడిన బంతులను కోహ్లీ వేటాడడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఐదు, ఆరు, ఏడో స్టంప్ ల దగ్గర పడిన బంతులకు కోహ్లీ ఔట్ కావడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమన్నారు. 2014లో అతడు అలాగే ఆఫ్ సైడ్ స్టంప్ ల మీద పడిన బంతులకే ఎక్కువ సార్లు అవుటైన విషయాన్ని గుర్తు చేశారు.

కాగా, 2004 సిడ్నీ టెస్టులో సచిన్ టెండూల్కర్ 241 పరుగులతో అజేయంగా నిలిచాడు. 613 నిమిషాల పాటు క్రీజులో నిలిచిన లిటిల్ మాస్టర్.. ఒక్కసారి కూడా కవర్ డ్రైవ్ ఆడలేదు. సచిన్ ఇన్నింగ్స్ తో భారత్ 705/7 భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. సొంతగడ్డపై ఆడుతున్న ఆస్ట్రేలియా మ్యాచ్ ను డ్రా చేసుకుంది.

More Telugu News