Devineni Uma: వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రావడం లేదు: దేవినేని ఉమ

No contractor is coming forward to take up works in AP says Devineni Uma
  • హంద్రీనీవా పనులు 28 నెలలుగా నిలిచిపోయాయి
  • అన్ని ప్రాజెక్టుల్లో పనులు ఆగిపోయాయి
  • పనులు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారన్న రైతులకు సమాధానం చెప్పాలి
రాయలసీమ జిల్లాలకు అత్యంత ప్రధానమైన హంద్రీనీవా పనులు గత 28 నెలలుగా నిలిచిపోయాయని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. టీడీపీ హయాంలో హెచ్ఎన్ఎస్ఎస్ కాలువల ద్వారా చివరి ప్రాంతం వరకు నీటిని అందించామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్లో పనులు నిలిచిపోయాయని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాని పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రాజెక్టు పనులను ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారంటున్న రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Devineni Uma
Telugudesam
Handriniva
YSRCP

More Telugu News