UK: వ్యాక్సిన్ల ద్వారా క‌రోనా నుంచి ర‌క్ష‌ణ‌పై కీల‌క విష‌యాలు గుర్తించిన ప‌రిశోధ‌కులు

  • బ్రిట‌న్ ప‌రిశోధ‌కుల అధ్య‌య‌నం
  • ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల సామ‌ర్థ్యాన్ని గుర్తించిన ప‌రిశోధ‌కులు
  • వ్యాక్సిన్లు రెండు డోసులు తీసుకున్న కొన్ని నెల‌ల‌కు త‌గ్గుతోన్న ర‌క్ష‌ణ శాతం
  • ఇప్ప‌టికే బూస్ట‌ర్ డోసుపై బ్రిట‌న్ దృష్టి
Britain scientists on  vaccine efficacy

కరోనాను క‌ట్ట‌డి చేసేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని వేగ‌వంతం చేసిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు దేశాలు 50 శాతం వ్యాక్సినేషన్ కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేశాయి. రెండు డోసులు తీసుకున్నప్ప‌టికీ కొంద‌రికి క‌రోనా సోకుతోన్న నేప‌థ్యంలో వచ్చే నెల బూస్టర్‌ డోసు ఇవ్వాలని బ్రిటన్ భావిస్తోంది.

క‌రోనా సామ‌ర్థ్యంపై అనేక ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో యూకేకు చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో కీలక విషయాలు వెల్ల‌డ‌య్యాయి. కరోనా లక్షణాలతో పాటు వ్యాక్సిన్ల‌ సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు యూకే ప్రభుత్వం ‘జెడ్‌వోఈ’ యాప్ ను రూపొందించింది.

దాని డేటా ఆధారంగా, ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు వేయించుకున్న 12 లక్షల మందిపై ప‌రిశోధ‌కులు అధ్య‌యనం చేసి ఫైజర్‌ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత తొలి నెల రోజులు వైరస్‌ నుంచి రక్షణ 88 శాతం ఉంటుంద‌ని తేల్చారు. ఐదు నుంచి ఆరు నెలల మ‌ధ్య‌ అది 74 శాతానికి తగ్గిందని తెలిపారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో తొలి నెలలో రక్షణ శాతం 77 ఉంద‌ని, నాలుగు నుంచి ఐదు నెలల్లో అది 67 శాతానికి త‌గ్గింద‌ని చెప్పారు.

More Telugu News