Kanyakumari: కన్నియాకుమారిలో వెనక్కి వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు

  • బంగాళాఖాతంలో సంభవించిన భూకంపం
  • పలు చోట్ల వెనక్కి వెళ్లిన సముద్రం
  • విపత్తుకు ముందు ప్రశాంతత లాంటిదంటున్న జాలరులు
Sea water went back in Kanyakumari

బంగాళాఖాతంలో సంభవించిన భూకంపం కారణంగా పలు చోట్ల సముద్రం వెనక్కి వెళ్లింది. ఏపీలోని అంతర్వేది వద్ద రెండు కిలోమీటర్లకు పైగా సముద్రం వెనక్కి వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తమిళనాడులోని ప్రసిద్ధ కన్నియాకుమారి (కన్యాకుమారి)లో కూడా సముద్రం వెనక్కి పోవడంతో బండరాళ్లు బయటపడ్డాయి.

మరోవైపు సముద్రం వెనక్కి వెళ్లడంతో పలుచోట్ల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. బంగాళాఖాతంలో భూకంపం రావడం, అలలు అసహజంగా ఉండటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. సముద్రగర్భంలో తీవ్ర మార్పులు జరిగే సమయంలో అలలు ప్రశాంతంగా ఉంటాయని... విపత్తు చోటు చేసుకునే ముందు ఉండే ప్రశాంతత లాంటిదని జాలరులు చెపుతున్నారు.

More Telugu News