Sudheer Babu: 'శ్రీదేవి..' కోసం రియల్ ఫైట్స్ చేసిన సుధీర్ బాబు!

  • ఇది గోదావరి జిల్లాలోని ఓ ప్రేమకథ
  • శ్రీదేవి కోసం తపించే సూరిబాబు కథ 
  • యాక్షన్ సీన్స్ లో డూప్ ను వాడలేదు
  • కనీసం రోప్ ను కూడా సుధీర్ బాబు ఉపయోగించలేదు 
Sridevi Soda Center movie update

సుధీర్ బాబు .. ఆనంది నాయకా నాయికలుగా 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా రూపొందింది. కరుణకుమార్ ఈ సినిమాకి  దర్శకుడిగా వ్యవహరించాడు. విజయ్ చిల్లా - శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమాను, రేపు భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి దర్శకుడు మాట్లాడాడు.

ఇది గోదావరి జిల్లాలో గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథ. గోదావరి జిల్లాలోని ప్రకృతి అందాలను మాత్రమే కాదు, కమ్యూనిటీ విషయంలో గ్రామీణ వాసుల భావోద్వేగాలు ఎలా ఉంటాయనేది ఈ సినిమాలో చూపించాము. సోడా సెంటర్ నడిపే శ్రీదేవితో సూరిబాబు అనే కుర్రాడు ప్రేమలో పడితే, అది ఎలాంటి పరిణామాలకు దారితీసిందనేదే కథ.

ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. రిస్కీ ఫైట్స్ ను డూప్ లేకుండా సుధీర్ బాబు చేశాడు. కొన్ని యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించేటప్పుడు కనీసం 'రోప్' కూడా వాడలేదు. ఆయన చేసిన ఈ ఫైట్స్ ఆడియన్స్ కి బాగా నచ్చుతాయి. ఈ సినిమా సుధీర్ బాబును మరో స్థాయికి తీసుకువెళుతుంది" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News