Andhra Pradesh: నేటి నుంచి 31 వరకు కుటుంబ సభ్యులతో కలిసి జగన్ ఉత్తర భారతదేశ పర్యటన

Andhrapradesh CM Jagan North India Tour Begins Today
  • నేటి మధ్యాహ్నం యాత్రకు బయలుదేరనున్న జగన్
  • ఈ నెల 28న జగన్ పెళ్లి రోజు
  • ఐదు రోజులపాటు ప్రభుత్వ వ్యవహారాలకు దూరంగా జగన్
ప్రభుత్వ వ్యవహారాలతో నిత్యం తలమునకలుగా గడిపే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు రోజులపాటు వీటికి దూరంగా గడపనున్నారు. కుటుంబంతో కలిసి నేటి మధ్యాహ్నం ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్లనున్నారు. తిరిగి ఈ నెల 30 లేదంటే 31న పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకుంటారు.

ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి జగన్ గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో ఒంటి గంటకు చండీగఢ్ బయలుదేరుతారు. సాయంత్రం నాలుగు గంటలకు సిమ్లాలోని ఒబెరాయ్ హోటల్‌కు చేరుకుని బస చేస్తారు. ఈ నెల 28న జగన్ 25వ పెళ్లి రోజు నేపథ్యంలో అక్కడే సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటారు.
Andhra Pradesh
Jagan
North India Tour

More Telugu News