KCR: ఎన్టీఆర్‌కు నమస్కారం చేయాలి.. సోనియమ్మకు థ్యాంక్స్ చెప్పాలి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే

TRS MLA Ramulu Naik praised Sonia Gandhi and NT Rama Rao
  • నక్సల్స్‌ను ఎన్టీఆర్‌ దేశభక్తులన్నారు.. అది సరైన భావజాలం
  • కేసీఆర్‌కు తన, మన భేదం లేదు
  • మూడోసారి కూడా ముఖ్యమంత్రి అవుతారు
  • తెలంగాణ ఇచ్చినందుకు సోనియాకు థ్యాంక్స్
నక్సల్స్‌ను దేశభక్తులన్న మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు నమస్కారం చేయాలని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీకి థ్యాంక్స్ చెప్పాలని ఖమ్మం జిల్లా వైరా టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. జిల్లాలోని బొక్కలతండాలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీలకు అతీతంగా ‘కల్యాణ లక్ష్మి’ చెక్కులు పంపారని అన్నారు.

కేసీఆర్‌కు తన, మన భేదం లేదని, ఆయన అందరి గురించి ఆలోచిస్తారని అన్నారు. ఆయన రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి అదే కారణమన్నారు. మూడోసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని రాములు నాయక్ జోస్యం చెప్పారు. పనిలో పనిగా ఎన్టీరామారావు, సోనియాగాంధీలను కూడా ప్రశంసించారు. నక్సల్స్‌ను దేశభక్తులుగా అభివర్ణించిన ఎన్టీఆర్‌కు నమస్కారం చేయాలని అన్నారు. అదే సరైన భావజాలమని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి థ్యాంక్స్ చెప్పాలని పేర్కొన్నారు.
KCR
Sonia Gandhi
Ramulu Naik
Telangana
NT Rama Rao

More Telugu News