Telugu Language Day: వర్చువల్ విధానంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు నిర్వహించనున్న తానా

  • రెండ్రోజుల పాటు వేడుకలు
  • ఈ నెల 28, 29 తేదీల్లో వేడుకల నిర్వహణ
  • సన్నద్ధమవుతున్న తానా ప్రపంచ సాహిత్య వేదిక 
  • గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకుని వేడుకలు
TANA conducts Telugu Language Day celebrations

ఈ నెల 28, 29 తేదీల్లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక రెండ్రోజుల పాటు ఈ వర్చువల్ వేడుకలు జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది. వ్యవహారిక భాషోద్యమ పితామహుడిగా కీర్తిప్రతిష్ఠలందుకున్న గిడుగు వేంకట రామమూర్తి జయంతి నేపథ్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పశ్చిమ బెంగాల్ మంత్రి డాక్టర్ శశి పిల్లలమర్రి (తెలుగు సంతతి వ్యక్తి) హాజరుకానున్నారు. ప్రత్యేక అతిథిగా పశ్చిమ బెంగాల్ డీజీపీ బొప్పూడి నాగరమేశ్, అతిథిగా టాలీవుడ్ నటుడు తనికెళ్ల భరణి హాజరుకానున్నారు. ఈ మేరకు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి వివరాలు తెలిపారు.

More Telugu News