ED: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులకు ఈడీ నోటీసులు

ED issues notice to Tollywood stars in drugs case
  • మళ్లీ తెరపైకి డ్రగ్స్ కేసు
  • 2017లో టాలీవుడ్ ప్రముఖులపై కేసు
  • తాజాగా రంగంలోకి ఈడీ
  • ఈ నెల 31 నుంచి సెప్టెంబరు 22 వరకు విచారణ
గతంలో టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం రేగడం తెలిసిందే. 2017లో పలువురు సినీ తారలపై మాదకద్రవ్యాల అంశంలో కేసు నమోదైంది. కాగా, ఈ వ్యవహారంలో తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది. పలువురు టాలీవుడ్ సినీ తారలకు నోటీసులు జారీ చేసింది. తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ స్పష్టం చేసింది.

ఈ కేసులో ఈ నెల 31 నుంచి సెప్టెంబరు 22 వరకు విచారణ జరిపేందుకు ఈడీ సిద్ధమైంది. రకుల్ ప్రీత్ సింగ్, పూరీ జగన్నాథ్, చార్మి, రవితేజ, రానా, తరుణ్, నవదీప్, నందు, శ్రీనివాస్, ముమైత్ ఖాన్ లకు ఈడీ నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. దీనిపై రవితేజ స్పందిస్తూ తనకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు.
ED
Drugs Case
Notice
Tollywood

More Telugu News