Team India: ఆండర్సన్ విజృంభణ... హెడింగ్లే టెస్టులో టీమిండియాకు కష్టాలు

Team India lost four wickets in third test
  • హెడింగ్లేలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్
  • మూడో టెస్టు ఆరంభం
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • 3 వికెట్లతో దెబ్బతీసిన ఆండర్సన్
హెడింగ్లేలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన కోహ్లీ సేన బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఇంగ్లండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ కొత్త బంతితో విజృంభించడంతో టీమిండియా వడివడిగా వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్ (0), ఛటేశ్వర్ పుజారా (1), కెప్టెన్ విరాట్ కోహ్లీ (7) ఆండర్సన్ అవుట్ స్వింగర్లకు బలయ్యారు.

కాస్తోకూస్తో పోరాడిన అజింక్యా రహానే (18)ను ఓల్లీ రాబిన్సన్ అవుట్ చేయడంతో భారత్ కష్టాలు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం భారత్ స్కోరు 27 ఓవర్లలో 4 వికెట్లకు 58 పరుగులు. క్రీజులో ఓపెనర్ రోహిత్ శర్మ (15 బ్యాటింగ్), రిషబ్ పంత్ (2 బ్యాటింగ్) ఉన్నారు.
Team India
England
James Anderson
Third Test

More Telugu News