Jagan: జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై సీబీఐ కోర్టు తీర్పు వాయిదా

Jagan bail reject petition judgement postponed to September 15
  • తీర్పును వచ్చే నెల 15న వెలువరిస్తామన్న సీబీఐ కోర్టు
  • జగన్, విజయసాయి ఇద్దరి పిటిషన్లపై ఒకేరోజున తీర్పు 
  • బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ వేసిన రఘురాజు
ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సీబీఐ కోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. వీటిలో జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై ఇంతకుముందే వాదనలు పూర్తయ్యాయి. మరోపక్క విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ పై నేడు వాదనలు పూర్తయ్యాయి.

ఇక జగన్ పై పిటిషన్ విషయంలో ఈ రోజు తీర్పును వెలువరిస్తామని గత విచారణ సందర్భంగా ప్రకటించిన కోర్టు... తీర్పును వచ్చే నెల 15న వెలువరిస్తామని నేడు పేర్కొంది. జగన్, విజయసాయిరెడ్డి ఇద్దరి పిటిషన్లపై తీర్పును ఒకే రోజున వెలువరిస్తామని చెప్పింది. ఈ పిటిషన్లను వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన సంగతి తెలిసిందే.
Jagan
Vijayasai Reddy
Bail
CBI Court

More Telugu News